Hyderabad, ఏప్రిల్ 8 -- OTT Thriller Movie: దివంగత బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తెలుసు కదా. అతని తనయుడు బాబిల్ ఖాన్ నటించిన మూవీ లాగౌట్ (Logout). ఈ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మంగళవారం (ఏప్రిల్ 8) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. మరో పది రోజుల్లో మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

మొబైల్ ఫోన్, సోషల్ మీడియా లేకుండా ఈ కాలం యువత ఒక్క క్షణం కూడా గడపడం లేదు. అయితే తెలియకుండానే వీటికి బానిసలైపోతూ.. తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ యువకుడి కథే ఈ లాగౌట్ మూవీ.

ఇందులో ప్రత్యూష్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా బాబిల్ ఖాన్ నటించాడు. మొబైల్ ఫోన్ పూర్తిగా బానిసగా మారిపోయిన వ్యక్తి అతడు. తన చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోడు.

10 లక్షల మంది ఫాలోవర్లే లక్ష్యంగా పని చేస్తుంటా...