భారతదేశం, ఏప్రిల్ 2 -- ఓటీటీల్లో డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్‍ల రిలీజ్ జోరు ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. అడపపాదడపానే వస్తున్నాయి. డబ్బింగ్‍లో సిరీస్‍లే ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నాయి. అయితే ఈ వారంలో ఒకే రోజు రెండు డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. విభిన్నమైన జానర్లలో అడుగుపెడుతున్నాయి. ఒకటి మిడిల్‍క్లాస్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ కాగా.. మరొకటి పక్కా క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోంది. ఆ రెండు సిరీస్‍లో ఏవో.. ఇక్కడ చూడొచ్చో మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

'హోమ్ టౌన్' వెబ్ సిరీస్‍పై మంచి అంచనాలు ఉన్నాయి. మిడిల్‍క్లాస్ ఫ్యామిలీ చుట్టూ సాగే సిరీస్ కావడంతో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ తెలుగు వెబ్ సిరీస్ ఈ శుక్రవారమే ఏప్రిల్ 4వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍లో సీనియర్ యాక్టర్ రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్...