Hyderabad, డిసెంబర్ 26 -- Telugu Science Fiction Mythological Thriller OTT: పర్ఫెక్ట్ కథా కథనంతో తెరకెక్కే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ చాలా బాగా ఎంగేజ్ చేస్తాయి. అయితే, తెలుగులో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలు చాలా అరుదు. ఈ మధ్య కాలంలో జోనర్ ఎలాంటిది అయినా వాటికి కాస్తా మైథాలజీ టచ్ ఇస్తున్నారు.

అలా, హిందూ పురాణాలు, ఇతిహాసాల వంటి మైథలాజికల్ అంశాలను జోడిస్తూ తెలుగులో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీనే రహస్యం ఇదం జగత్. మొదటి నుంచి పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో అట్రాక్ట్ చేసిన రహస్యం ఇదం జగత్ సినిమాలో రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథ్ వంటి అంతా కొత్త వాళ్లు నటించారు.

సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై పద్మ రవినూతులు, హిరణ్య రావినూతుల నిర్మించిన రహస్యం ఇదం జగత్ మూవీకి కోమల...