భారతదేశం, ఫిబ్రవరి 20 -- భారతీయ సమాజంలో అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన అంశం 'వైవాహిక అత్యాచారం' (Marital Rape). పవిత్రమైన బంధంగా భావించే పెళ్లి వెనుక దాగి ఉన్న చీకటి కోణాన్ని ప్రశ్నిస్తూ ఓటీటీలోకి వచ్చేస్తోంది సరికొత్త వెబ్ సిరీస్ 'చిరాయా' (Chiraiya).

బాలీవుడ్ ప్రముఖ నటి దివ్యా దత్తా ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్ చిరాయా టీజర్ శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలైంది. ఈ చిరాయా టీజర్ ఆరంభంలో పెళ్లి వేడుకలు, కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన పూజ అనే యువతి కనిపిస్తుంది.

అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవదు. మరుసటి క్షణమే ఆ యువతి ఒంటిపై గాయాలతో, కళ్లలో కన్నీళ్లతో మేడపై సూసైడ్ చేసుకునే భయానక స్థితిలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా దివ్యా దత్తా అడిగే ఒక ప్రశ్న సమాజంపై గట్టి దెబ్బ కొడుతుంది.

"ఇదే నా ప్రశ్న.. పెళ్లయ్యాక భార్య ఇష్టం...