భారతదేశం, ఏప్రిల్ 8 -- OTT Romantic Comedy: బిగ్‌బాస్ ఫేమ్ ఆషురెడ్డి ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన తెలుగు మూవీ ప‌ద్మ‌వ్యూహంలో చ‌క్ర‌ధారి సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైంది. మంగ‌ళ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ద్వారా ప్ర‌వీణ్ రాజ్ కుమార్, శ‌శికా టిక్కూ హీరోహీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సంజ‌య్ రెడ్డి బంగార‌పు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప‌ద్మ‌వ్యూహంలో చ‌క్ర‌ధారి మూవీ తెర‌కెక్కింది. ఈ సినిమాలో మ‌ధునంద‌న్‌, భూపాల్ రాజ్‌, మ‌హేష్ విట్టా, ముర‌ళీధ‌ర్ గౌడ్‌ కీల‌క పాత్ర‌లు పోషించారు.

చ‌క్రి రాయ‌ల‌సీమ‌లోని ఓ ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చి సిటీలో జాబ్ చేస్తుంటాడు. త‌మ ఊరికే చెందిన స‌త్య‌తో చ‌క్రికి చిన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం ఉంటుంది. స‌త్య‌కు సిటీ...