భారతదేశం, ఫిబ్రవరి 15 -- OTT Releases This Weekend: ప్రతి వారంలాగే ఈ వీకెండ్ కూడా ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి ఎన్నో సినిమాలు, టీవీ షోలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పైకి రానున్నాయి. ఇందులో ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ది కేరళ స్టోరీ, నా సామిరంగలాంటి మూవీస్ ఉన్నాయి. మరి ఈ వీకెండ్ రాబోతున్న ఆ సినిమాలు, షోలు ఏవో ఒకసారి చూద్దాం.

ఈ వీకెండ్ చూడటానికి ఇప్పటికే కొన్ని టాప్ సినిమాలు ఓటీటీల్లోకి రాగా.. శుక్ర, శనివారాల్లో మరిన్ని సినిమాలు, షోలు వస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడటానికి ఇప్పటికే వచ్చిన, రాబోతున్న సినిమాలు, షోలు ఏవో మీరూ చూడండి.

గతేడాది థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన వివాదాస్పద మూవీ ది కేరళ స్టోరీ మూవీ మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా శుక్రవారం (...