భారతదేశం, మార్చి 26 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన లూసిఫర్ చిత్రం బ్లాక్‍బస్టర్ సాధించింది. స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 2019 మార్చిలో రిలీజై బంపర్ హిట్ కొట్టింది. రూ.30కోట్లతో రూపొంది దాదాపు రూ.120కోట్ల కలెక్షన్లు సాధించింది. అంతటి ఘన విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‍గా ఎల్ 2: ఎంపురాన్ చిత్రం వస్తోంది. రేపే (మార్చి 27) ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. అయితే, సీక్వెల్ విడుదలకు ముందు ఫస్ట్ పార్ట్ ఓటీటీలో అదరగొడుతోంది.

ఎల్2: ఎంపురాన్ థియేటర్లలో రిలీజయ్యే ముందు లూసిఫర్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చాలా మంది చూస్తున్నారు. ఎంపురాన్ మూవీకి సిద్ధమైన వారు లూసిఫర్ చూస్తూ కథను గుర్తు తెచ్చుకుంటున్నారు. దీంతో ప్రైమ్ వీడియోలో లూసిఫర్‌కు ఇప్పుడు భారీగా...