భారతదేశం, జనవరి 30 -- ఓటీటీలోకి వారం వారం సరికొత్త కథనాలతో సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఇంప్రెస్ చేసే జోనర్లలో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ వంటివే ఎక్కువగా ఉంటాయి. అయితే, క్రైమ్ థ్రిల్లర్స్‌లో కథ ఎలా ఉన్నా టేకింగ్, గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ఉంటే ప్రేక్షకుడు ఫుల్‌గా సంతృప్తి చెందుతాడు.

అలాంటిది ఒక డిఫరెంట్ పాయింట్‌తోనే క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కితే. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓటీటీ సిరీస్. ఈ వెబ్ సిరీస్ పేరు దేవ్‌ఖేల్. అంటే దేవుడు ఆడే ఆట అని అర్థం వస్తుంది. మైథాలజీ పాయింట్‌తో క్రైమ్ థ్రిల్లర్స్ ఇప్పటివరకు బాగానే వచ్చాయి. ఆ మైథలాజీ క్రైమ్ థ్రిల్లర్‌లోనే డిఫరెంట్ పాయింట్‌తో దేవ్‌ఖేల్ చిత్రీకరించారు.

దేవ్‌ఖేల్ ఓటీటీ సిరీస్ అంతా దేవుడు హత్యలు, గ్రామ ఆచారాలతో నలిగిపోయే పోలీస్ చుట్టూనే సాగ...