భారతదేశం, ఫిబ్రవరి 15 -- మలయాళ మూవీ 'రేఖాచిత్రం' సూపర్ హిట్ అయింది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రశంసలను దక్కించుకోవటంతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. జనవరి 9న ఈ మూవీ మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. ఈ రేఖాచిత్రం మూవీ ఎప్పడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

రేఖాచిత్రం సినిమా మార్చి 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ నేడు (ఫిబ్రవరి 15) అధికారికంగా వెల్లడించింది. "ఓ మరిచిపోయిన నేరం. పాతిపెట్టిన నిజం. అన్నింటినీ బయటికి తీసే సమయం వచ్చింది. మార్చి 7 నుంచి సోనీలివ్‍లో రేఖాచిత్రం" అని ఆ ఓటీటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రేఖాచిత్రం మూవీ మార్చి 7న ఐదు భాషల్లో సో...