భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ వారం కూడా కొన్ని చిత్రాలు అడుగుపెట్టన్నాయి. అయితే, రెండు సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ సబ్జెక్టులతో ఈ రెండు సినిమాలు ఉన్నాయి. ఈ వీకెండ్‍కు కుటుంబంతో కలిసి ఈ చిత్రాలను చూడొచ్చు. ఇందులో ఓ మూవీ తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఉంటుంది. ఈ వారం డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్న రెండు చిత్రాలు ఏవంటే..

ది మెహతా బాయ్స్ మూవీ నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బొమన్ ఇరానీ, అవినాశ్ తివారీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీతో దర్శకుడిగానూ మారారు బొమన్.

తండ్రీకొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామా ది మెహతా బాయ్స్ మూవీని తెరకెక్కించార...