భారతదేశం, ఏప్రిల్ 13 -- అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించిన మేరే హస్బెండ్‍ కీ బీవీ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. టైటిల్‍తోనే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఇంట్రెస్ట్ పెంచింది. అయితే, ఈ సినిమా విడుదలయ్యాక మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. దీంతో కమర్షియల్‍గా డిజాస్టర్ అయింది. ఈ మేరే హస్బెండ్‍ కీ బీవీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కొందరు ఎదురుచూస్తున్నారు.

మేరే హస్బెండ్‍ కీ బీవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుందో డేట్ బజ్ నడుస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

మేరే హస్బెండ్‍ కీ బీవీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఆ ఓటీటీలో ఏప్రిల్ 18వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోం...