Hyderabad, ఏప్రిల్ 6 -- The Bondsman OTT Release: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉన్నాయి. వాటిలో ఎక్కువగా హారర్ థ్రిల్లర్స్‌ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి. వీటికి ఇతర జోనర్ అంశాలను యాడ్ చేసి మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్‌గా హారర్ యాక్షన్ జోనర్‌లో ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ఆ సిరీసే ది బాండ్స్‌మ్యాన్. అమెరికన్ యాక్షన్ హారర్ జోనర్‌లో తెరకెక్కిన ది బాండ్స్‌మ్యాన్ వెబ్ సిరీస్‌‌కు గ్రెంగర్ డేవిడ్ దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు పాట్ ఓ గోల్డ్‌కు కథ అందించారు. ఇక ది బాండ్స్‌మ్యాన్ సిరీస్‌లో పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కెవిన్ బాకన్ మెయిన్ లీడ్ రోల్ చేశారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ హాలోమ్యాన్ మూవీతో కెవిన్ బాకన్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో తెలిస...