భారతదేశం, ఫిబ్రవరి 6 -- OTT Horror: హాలీవుడ్ హార‌ర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్ బిలీవ‌ర్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజైంది. ఇప్ప‌టికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌, జియో సినిమా ఓటీటీ, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది. ఈ ఓటీటీల‌లో రెంట‌ల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోండ‌గా నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఈ హార‌ర్ మూవీలో లేస్టీ ఓడోమ్‌, ఓలివియా ఓనిల్‌, లిడ్యా జెవెట్ కీల‌క పాత్ర‌లు పోషించారు. డేవిడ్ గోర్డ‌న్ గ్రీన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అక్టోబ‌ర్ 2023లో ది ఎగ్జార్సిస్ట్ బిలీవ‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. 30 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 137 మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇండియ‌న్ క‌రెన్సీలో 11 వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష...