Hyderabad, మార్చి 7 -- OTT Family Drama: మలయాళ స్టార్ హీరోలు జోజు జార్జ్, సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ నారాయణీంతే మూన్నాన్‌మక్కల్ (Narayaneente Moonnaanmakkal). ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల తిరక్కుండానే ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.

నారాయణీంతే మూన్నాన్‌మక్కల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. జోజు జార్జ్, సూరజ్ వెంజరమూడులాంటి వాళ్లు నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. శరణ్ వేణుగోపాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

అతనికి ఇదే తొలి సినిమా. శుక్రవారం (మార్చి 7) ఉదయం నుంచే ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే కేవలం మలయాళం ఆడియోతోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఐఎండీబీలో ఈ సినిమాకు 8.2 రేటింగ్ ఉండటం విశేషం.

నారాయణీం...