Hyderabad, ఏప్రిల్ 4 -- Home Town OTT Release Today And Rajeev Kanakala Comments: ఓటీటీలో తెలుగు ఫ్యామిలీ కామెడీ వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇంతకుముందు ఈటీవీ విన్‌‌లో ఓటీటీ రిలీజ్ అయిన 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

90స్ తరహాలోనే సరికొత్తగా రూపొందిన తెలుగు ఫ్యామిలీ కామెడీ సిరీస్ హోమ్ టౌన్. ఈ తెలుగు వెబ్ సిరీస్‌లో పాపులర్ యాక్టర్ రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ ప్రధాన పాత్రల్లో ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ఇతర కీలక పాత్రల్లో నటించారు. హౌమ్ టౌన్‌ సిరీస్‌కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌కు నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మాతలుగా వ్యవహరించారు.

కామెడీ, ఫన్, ఎమోషనల్‌గా సాగే హౌమ్ టౌన్ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 4) వచ్చేసింది. నేటి నుంచి ఆహాలో హౌమ్ టౌన్ ఓటీటీ స్...