Hyderabad, ఫిబ్రవరి 26 -- OTT Crime Thriller Web Series: సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు కన్నెడా (Kanneda). బుధవారం (ఫిబ్రవరి 26) ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ కన్నెడా వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ ను మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ చేయనుంగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. చందన్ అరోరా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్.. కెనడా వెళ్లిన ఓ పంజాబీ అక్కడి వివక్షను ఎదురించి ఓ డాన్ గా ఎలా ఎదిగాడన్నదాని చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ లో పర్మీష్ వర్మ, రణ్‌వీర్ షోరే, అరుణోదయ్ సింగ్, జీషాన్ ఆయుబ్ లాంటి వాళ్లు కీలకపాత్రలు పోషించారు.

ఈ సిరీస్ ట్రైలర్ షాకింగ్ ట్విస్టులు, క్రైమ్, యాక్షన్ తో నిండిపోయింది. పర్మీష్ వర్మ ఇందులో లీడ్ ర...