Hyderabad, మార్చి 31 -- OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఓటీటీలో, అందులోనూ నెట్‌ఫ్లిక్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో తాజాగా వచ్చిన మలయాళం మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ నిరూపిస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ టాప్ 1లో ట్రెండింగ్ అవుతోంది.

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో తొలి స్థానంలో ఉంది. మార్చి 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజైన 27 సినిమాల్లో ఏకైక హిట్ గా నిలిచిన ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. నెట్‌ఫ్లిక్స్ లోనూ అదే జోరు చూపిస్తోంది.

ఓ చిన్న నకిలీ గొలుసు తాకట్టు కేసు ఓ అమ్మాయిల ఆత్మహత్యలకు కారణమయ్యే పెద్ద కేసును పరిష్కరించడానికి...