భారతదేశం, మార్చి 4 -- జహాన్ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్‍ వారెంట్ వెబ్ సిరీస్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆరంభం నుంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍కు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. విక్రమాదిత్య మోత్వానే ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. తీహార్ జైలులో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా బ్లాక్ వారెంట్ సిరీస్‍ను తెరకెక్కించారు. ఈ సిరీస్ ఓటీటీలో అదరగొడుతూ ఇంకా ట్రెండింగ్‍లో ఉంది.

బ్లాక్‍వారెంట్ వెబ్ సిరీస్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో 50రోజులకుపైగా ట్రెండింగ్‍లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఇండియా సిరీస్ కేటగిరీలో ఈ సిరీస్ టాప్-8లో ఉంది. కొన్ని వారాలు ఈ సిరీస్ ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచింది. బ్లాక్ వారెంట్ సిరీస్ ఈ ఏడాది జనవరి 10వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

నెట్‍ఫ్లిక్స్‌లో బ్లాక్‍వారెంట్ సిరీస్ హిం...