భారతదేశం, మార్చి 8 -- ఓటీటీలో మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్‍బస్టర్ మూవీ 'రేఖాచిత్రం' ఓటీటీ స్ట్రీమింగ్‍లోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సూపర్ బ్లాక్‍బస్టర్ అయిన ఈ మలయాళ మూవీ.. ఓటీటీలోకి ఐదు భాషల్లో వచ్చింది. ఈ మూవీని ఓటీటీ చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

రేఖాచిత్రం మూవీ సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం గురువారం (మార్చి 6) సాయంత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. థియేటర్లలో మలయాళం ఒక్కటే విడుదలైన ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఈ చిత్రంపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. రేఖాచిత్రం మూవీలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు ...