భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వెబ్ సిరీస్‍లు వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. ఇలాంటి థ్రిల్లర్ సిరీస్‍లపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తుండటంతో క్యూ కట్టేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. అదే 'క్రైమ్ బీట్'. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా అధికారికంగా రివీల్ అయింది. ఈ సిరీస్‍లో షకీబ్ సలీం, సబా అజాద్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రైమ్ బీట్ సిరీస్ వివరాలు ఇవే..

క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా వెల్లడించింది. ఓ పోస్టర్ కూడా తీసుకొచ్చింది. "జర్నలిస్ట్ అభిషేక్ ఫేమస్ కావాలని ఆశిస్తుంటాడు. ఓ పోలీస్‍తో కలిసి సిటీలో ఓ సీక్రెట్‍ను కనుగొంటాడు. చీఫ్ ఎడిటర్ కూడా సీక్రెట్స్ దాస్తున్నాడని తెలుసుకుంటాడు. ...