భారతదేశం, ఏప్రిల్ 10 -- OTT Crime Thriller: మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ప్ర‌వీణ్‌కూడు షాప్పు ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. బాసిల్ జోసెఫ్‌, సౌబీన్ షాహిర్ హీరోలుగా న‌టించిన ఈ మూవీ ఏప్రిల్ 11న సోనీలివ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

ప్ర‌క‌టించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే ఈ మ‌ల‌యాళం మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు సోనీలివ్ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 10... సాయంత్రం నుంచే ఈ మూవీని చూడొచ్చ‌ని వెల్ల‌డించింది.

ప్ర‌వీణ్‌కూడు షాప్పు మూవీని సోనీలివ్‌లో మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.

డార్క్ హ్యూమ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ప్ర‌వీణ్ కూడు షాప్పు మూవీ థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాకు శ్రీరాజ్ శ్రీనివాస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీతోనే అత‌డు ద‌ర్శ‌కుడిగా మ‌ల‌యాళంలోకి ...