భారతదేశం, మార్చి 3 -- తమిళ నటుడు మణికందన్ హీరోగా నటించిన కుడుంబస్తన్ చిత్రం మంచి హిట్ అయింది. ఈ కామెడీ డ్రామా చిత్రం ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. ఈ తమిళ మూవీ జనవరి 24వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది.

కుడుంబస్తన్ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 7వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై నేడు (మార్చి 3) ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీ థియేటర్లలో తమిళంలో మాత్రమే విడుదలైంది. జీ5 ఓటీటీలో మార్చి 7న ఐదు భాషల్లో రానుంది.

కుడుంబస్తన్ చిత్రంలో మణికందన్ నటన మెప్పించింది. చిన్న ఉద్యోగంతో కుటుంబాన్ని నడుపుతూ ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మధ్యతరగ...