భారతదేశం, మార్చి 10 -- కుటుంబస్థాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఈ తక్కువ బడ్జెట్ చిత్రం మంచి సక్సెస్ అయింది. మణికందన్ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 24న తమిళంలో విడుదలైంది. పాజిటివ్ టాక్‍ తెచ్చుకుంది. కుటుంబస్థాన్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. ఓ మైలురాయి అధిగమించింది.

కుటుంబస్థాన్ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను అధిగమించింది. ఈ విషయాన్ని జీ5 నేడు (మార్చి 10) వెల్లడించింది. "డైనింగ్ టేబుల్ చర్చల నుంచి లివింగ్ రూమ్ తగాదాల వరకు! 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను ఈ ఫ్యామిలీ డ్రామా దాటేసింది" అని సోషల్ మీడియాలో జీ5 ట్వీట్ చేసింది. మూడు రోజుల్లోనే ఈ మార్కును ఈ చిత్రం దాటేసింది.

కుటుంబస్థాన్ మూవీ జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హి...