భారతదేశం, ఫిబ్రవరి 19 -- బాలీవుడ్ మూవీ బేబీ జాన్ మంచి అంచనాలతో వచ్చి బోల్తా కొట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‍ ఈ చిత్రంతోనే బాలీవుడ్‍లో అడుగుపెట్టారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఈ బేబీ జాన్ చిత్రం నేడు రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

బేబీ జాన్ చిత్రం నేడు (ఫిబ్రవరి 19) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ మూవీ సాధారణ స్ట్రీమింగ్‍కు ఉంటుందని అంచనాలు రాగా.. అందుకు ఒక రోజు ముందుగానే ఎంట్రీ ఇచ్చేసింది. ఈనెల మొదట్లోనే రెంటల్ విధానంలో బేబీ జాన్ చిత్రం ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు రెంట్ తొలగిపోయి రెగ్యులర్ స్ట...