Hyderabad, మార్చి 17 -- OTT Action Drama: ఓటీటీలోకి సుమారు రెండు నెలల తర్వాత ఓ హిందీ యాక్షన్ డ్రామా రానుంది. రెండు వారాలుగా రెంట్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా పేరు స్కై ఫోర్స్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీ.. ఇప్పుడు ఫ్రీగా అందుబాటులోకి రావడానికి సిద్దమవుతోంది.

బాలీవుడ్ లో ఈ ఏడాది అతిపెద్ద హిట్ సినిమాల్లో ఒకటి స్కై ఫోర్స్ (Sky Force). ఈ ఏడాది జనవరి 24న రిపబ్లిక్ డేకు ముందు థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.166 కోట్లు వసూలు చేసిందీ మూవీ. ఇప్పుడు మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. ఇప్పటికే రెంట్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఆ రోజు నుంచి సబ్‌స్క్రైబర్లందరూ ఈ మూవీని చూసే వీలుంటుంది.

అభిషేక్ అనిల్ కపూర్, సందీప్ కేవ్లానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, వీర్ పహారియా, నిమ్రత్ కౌర్, సార...