భారతదేశం, ఏప్రిల్ 11 -- OTT Action Comedy: మ‌ల‌యాళం యాక్ష‌న్ కామెడీ మూవీ బ్యాడ్‌బాయ్స్ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరు నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుద‌లైంది.

బ్యాడ్‌బాయ్స్ మూవీలో సౌత్ సీనియ‌ర్ యాక్ట‌ర్స్ రెహ‌మాన్‌, బాబు ఆంథోనీ హీరోలుగా క‌నిపించారు. ధ్యాన్ శ్రీనివాస‌న్‌, బిబిన్ జార్జ్‌, అన్స‌న్ పాల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు ఒమ‌ర్ లులు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోటిన్న‌ర బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మూడు కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

బ్యాడ్ బాయ్స్ సినిమాలో రెహ‌మాన్‌, బాబ్ ఆంథోనీ క్యారెక్ట‌ర్స్‌ను డిఫ‌రెంట్‌గా డైరెక్ట‌ర్ డిజైన్ చేసుకున్నాడు. సీరియ‌స్‌గా క‌నిపిస్తూనే వారు ప‌డించిన కామెడీ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న‌ది.

మేరీ అనే అమ్మాయిని ఇష్ట‌ప‌డ‌తాడు అం...