భారతదేశం, ఫిబ్రవరి 19 -- మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఆ కోవలోనే జనవరి 22న విడుదలైన లేటెస్ట్ మలయాళ స్పోర్ట్స్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే 'చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్' (Chatha Pacha). చథా పచ్చ అంటే మలయాళంలో డూ ఆర్ డై అనే మీనింగ్ వస్తుంది.

రోషన్ మాథ్యూ, అర్జున్ అశోకన్, విశాఖ్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా చథా పచ్చ ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 19) వచ్చేసింది. జనవరి 22న మలయాళంలో రిలీజ్ అయిన చథా పచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 90వ దశకంలో డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)ని పిచ్చిగా ప్రేమించిన వారికి ఈ సినిమా ఒక ఎమోషనల్ రైడ్‌లా అనిపించింది.

థియేటర్లలో విడుదలైన చథా పచ్చ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 31.05 కోట్లు రాబట్టింది. అలాగే, ఐఎమ్‌డీబీలో ఈ సినిమాకు పదికి 7 రేటింగ్ వ...