భారతదేశం, ఏప్రిల్ 16 -- బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన 'కేసరి చాప్టర్ 2: ది అన్‍టోల్డ్ స్టోరీ ఆఫ్ ది జలియన్‍ వాలాబాగ' సినిమాపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. జలియన్ వాలాబాగ్ మారణహోమం గురించి ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, ఈ కేసరి చాప్టర్ 2 సినిమా ఓటీటీ హక్కుల గురించి సమాచారం వెల్లడైంది.

కేసరి చాప్టర్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‍స్టార్ ఓటీటీ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. జూన్‍లో ఈ సినిమా జియోహాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.

హిస్టారిక్ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ కేసరి చాప్టర్ 2 సినిమాకు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించారు. న్యాయవాది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పటి అధ్యక్షుడు సి.శంకరన...