భారతదేశం, ఏప్రిల్ 10 -- విక్కీ కౌశ‌ల్‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఛావా ఓటీటీలో రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యింది. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కేవ‌లం హిందీ వెర్ష‌న్ మాత్రమే శుక్ర‌వారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. తెలుగుతో పాటు ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అన్న‌ది నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేయ‌లేదు.

ఛత్రపతి శివాజీ త‌న‌యుడు శంభాజీ మహారాజ్ జీవితం హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఫిబ్ర‌వ‌రి 14న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ 790 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ ఏడాది హిందీలోనే కాకుండా ఇండియా వైడ్‌గా హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా ఛావా రిక...