భారతదేశం, మార్చి 16 -- ఒప్పో తన కొత్త మిడ్-రేంజ్ సిరీస్ ఒప్పో ఎఫ్29, ఒప్పో ఎఫ్ 29ప్రోలను మార్చ్​ 20న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. చైనీస్ స్మార్ట్​ఫోన్​ తయారీదారు గతంలో తన ఎఫ్ సిరీస్​తో మన్నికపై దృష్టి సారించింది. ఎఫ్29 లైనప్ ఇదే పద్ధతిలో మార్కెట్​లోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.

వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ కోసం ఈ రెండు ఫోన్లు ఐపీ68, ఐపీ69 రేటింగ్​తో వస్తాయని ఒప్పో ఇప్పటికే ధృవీకరించింది. అంటే అవి 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాల వరకు పనిచేయగలవు. ఇది కాకుండా, ఒప్పో ఎఫ్29 సిరీస్​కి సంబంధించిన ఇతర వివరాలు గోప్యంగా ఉన్నాయి. కానీ లీకులు మాత్రం పలు ఎగ్జైటింగ్​ వివరాలను వెల్లడించాయి. అవేంటంటే..

ఒప్పో ఎఫ్29 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.7 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్​ప్లేను కలిగి ఉండనుంది. ఈ ఫోన్ మీ...