భారతదేశం, ఏప్రిల్ 15 -- చాట్​జీపీటీ అనే విప్లవంతో ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తున్న ఓపెన్​ఏఐ సీఈఓ సామ్​ ఆల్ట్​మన్..​ సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్​ మీడియా వేదికగా 'హైరింగ్​'ని ప్రకటించారు. మౌలిక సదుపాయాలు, భారీ స్థాయి కంప్యూటింగ్ వ్యవస్థలపై ఆసక్తి ఉన్నవారి కోసం వెతుకుతున్నట్టు వెల్లడించారు.

"ప్రస్తుతం OpenAIలో భారీ స్థాయిలో, మతిపోయే విధంగా పనులు జరుగుతున్నాయి. మా ముందు చాలా కఠినమైన / ఆసక్తికరమైన సవాళ్లు ఉన్నాయి," అని ఆల్ట్​మన్ ఎక్స్​లో ఒక పోస్ట్​లో రాసుకొచ్చారు. "మాతో చేరడాన్ని పరిగణించండి! మేము మీ సహాయాన్ని ఉపయోగించుకుంటాము," అని సామ్​ ఆల్ట్​మన్​ అన్నారు.

సిస్టెమ్​ని ఉపయోగించుకుని హై పర్ఫార్మెన్స్​ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవారి కోసం ఓపెన్​ఏఐ చూస్తోందని సీఈఓ సామ్​ ఆల...