భారతదేశం, ఫిబ్రవరి 5 -- Ola Roadster X: ఓలా ఎలక్ట్రిక్ లేటెస్ట్ గా రోడ్ స్టర్ ఎక్స్ సిరీస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ సిరీస్ ను లాంచ్ చేసింది. ఓలా స్కేలబుల్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన, సరికొత్త రోడ్‌స్టర్ X సిరీస్‌ ఇది. ఈ సిరీస్ లో మొత్తం 5 వేరియంట్లు ఉన్నాయి. ఈ సిరీస్ లో రోడ్‌స్టర్ X వేరియంట్ రూ. 74,999 ధరతో ప్రారంభమవుతుంది. రోడ్‌స్టర్ X+ 4.5kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ ధర రూ. 1,04,999 గా నిర్ణయించారు. రోడ్‌స్టర్ X+ 9.1kWh (4680 భారత్ సెల్‌తో) బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ ధర రూ. 1,54,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది 501 కిమీల పరిధిని అందిస్తుంది.

ఓలా రోడ్ స్టర్ ఎక్స్ ఎంట్రీ లెవల్ మోడల్. ఇది రూ .74,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదలైంది. ఇది ఓలా బ్రాండ్ నుండి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ బైక్. స్పోర్టీ లుక్ తో వ...