భారతదేశం, మార్చి 22 -- 512 వారాల కనిష్ఠ స్థాయిల నుంచి బలంగా పుంజుకున్న ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర గత వారంలో వార్తల్లో నిలిచింది. ఎన్​ఎస్​ఈలో ఒక్కో షేరుకు రూ.46.37 కనిష్టాన్ని తాకిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర గత వారం 15% ర్యాలీని నమోదు చేసి రూ. 56 వద్ద ముగిసింది. అయితే ఇటీవలి సెషన్లలో జరిగిన నష్టాలను పూడ్చుకోవడానికి ఈవీ స్టాక్​ ఇది సరిపోదు. ఓలా ఎలక్ట్రిక్ షేరు జీవితకాల గరిష్ట స్థాయి రూ.157.40 కంటే 65% తక్కువలో ట్రేడ్​ అవుతోంది ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్​ రూ.76 కంటే 26 శాతం తక్కువలో ఉంది. మరి ఈ స్టాక్​ పరిస్థితేంటి? నెక్ట్స్​ పెరుగుతుందా? షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంత?

స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ షేర్లకు రూ .56 వద్ద 20-డీఈఎంఏ రెసిస్టెన్స్​ ఉంది. ఇది దాటి బ్రేకౌట్​ ఇవ్వడానికి సిద్ధంగా స్టాక్​ సిద...