భారతదేశం, జనవరి 28 -- చైనాకు చెందిన డీప్​సీక్​ ఐఏ.. అమెరికా స్టాక్​ మార్కెట్​లలో రక్తపాతాని కారణమైంది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్​ 3శాతం పతనమైంది. మరీ ముఖ్యంగా.. ఏఐ వృద్ధిపై భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్న చిప్​ తయారీ సంస్థ ఎన్​విడియాపై డీప్​సీక్​ ప్రభావం భారీగా పడింది. ఈ ఎన్​విడియా స్టాక్​.. ఒక్క ట్రేడింగ్​ సెషన్​లో దాదాపు 600 బిలియన్​ డాలర్లను (రూ. 5,18,84,43,00,00,000) కోల్పోయింది. ప్రపంచ స్టాక్​ మార్కెట్​ చరిత్రలో ఇదే అతిపెద్ద 'సింగిల్​ డే లాస్​' అని నివేదికలు చెబుతున్నాయి.

డీప్​సీక్​ అనేది చైనాకు చెందిన ఒక ఏఐ స్టార్టప్​. గత వారంలో ఆర్​1 పేరుతో ఏఐ మోడల్​ని ఈ డీప్​సీక్​ ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇది.. ఓపెన్​ఏఐకి చెందిన చాట్​జీపీటీ సహా ఇతర దిగ్గజ టెక్​ కంపెనీల ఏఐలకు గట్టి పోటీనిస్తోంది.

తక్కువ ఖర్చు, తక్...