భారతదేశం, మార్చి 9 -- ఇండియాలో నిస్సాన్​ కంపెనీకి ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ మోడల్ మాగ్నైట్​! ఇప్పుడు ఈ నిస్సాన్​ మాగ్నైట్​ ఎస్​యూవీ ధరను రూ. 4వేలు పెంచింది సంస్థ. అసలు విషయం ఏంటంటే, మాగ్నైట్​ ధర పెరగడం ఈ ఏడాదిలో ఇప్పటికే ఇది రెండోసారి! నిస్సాన్​ మాగ్నైట్​ ఎస్​యూవీ ధరను రూ. 22వేలు పెంచుతున్నట్టు జనవరి 31న సంస్థ ఒక ప్రకటన చేసింది. ఇక తాజా పెంపుతో, మాగ్నైట్ ప్రారంభ ధర రూ .6.14 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. ఈ ఎస్​యూవీ ఆరు వేరియంట్లు, 12 కలర్ ఆప్షన్లు, రెండు ఇంజన్లు, మూడు ట్రాన్స్​మిషన్ ఆప్షన్స్​లో వస్తుంది.

తాజా ధరల పెంపు.. భారతదేశంలో నిస్సాన్ విక్రయించే రెండు ప్యాసింజర్ వాహనాల్లో ఒకటైన నిస్సాన్ మాగ్నైట్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. ఫలితంగా ఇప్పుడు మాగ్నైట్​ ఎక్స్​షోరూం ధర రూ. 6.14 లక్షల నుంచి రూ. 11.92 లక్షల వరకు ఉంటుంది.

నిస్సాన్ కొద...