భారతదేశం, ఫిబ్రవరి 23 -- Nick Jonas: ప్రియాంక చోప్రా భ‌ర్త నిక్ జోన‌స్ హీరోగా న‌టించిన హాలీవుడ్ కామెడీ డ్రామా మూవీ ది గుడ్ హాఫ్ ఓటీటీలోకి వ‌చ్చింది. జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హాలీవుడ్ సినిమాకు రాబర్ట్ స్క్వార్ట్జ్‌మాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నిక్ జోన‌స్‌తో పాటు బ్రిట‌నీ స్నో, అలెగ్జెండ్రా షిప్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

2023లోనే ది గుడ్ హాఫ్ షూటింగ్ పూర్త‌యింది. ట్రిబెక్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. థియేట‌ర్ల‌లో మాత్రం 2024 జూలైలో రిలీజైంది. డీసెంట్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. ఈ సినిమాలో నిక్ జోన‌స్ యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఎమోష‌న‌ల్ రోల్‌లో మెప్పించాడ‌ని క్రిటిక్స్ పేర్కొన్నారు.

ది గుడ్ హాఫ్ మూవీలో రెన్ వీలాండ్ అనే క్యారెక్ట‌ర్‌లో నిక్ జోన‌స్ న‌టించాడు. రెన్‌వీలాండ్ కుటుంబానికి...