భారతదేశం, మార్చి 22 -- రాయల్ ఎన్​ఫీల్డ్​ నుంచి కొత్త బైక్​ లాంచ్​కు రెడీ అవుతోంది. దీని పేరు రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 650. ఈ బైక్​ని మోటోవర్స్ 2024లో సంస్థ ప్రదర్శించింది. ఇక ఈ రెట్రో మోటార్ సైకిల్ మార్చ్​ 27న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. బ్రాండ్ విక్రయించే 650 సీసీ బైక్స్​ శ్రేణిలో ఇది చేరుతుంది. ఇందులో షాట్​గన్ 650, ఇంటర్​సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మెటియోర్ 650, ఇంటర్​సెప్టర్ బేర్ 650 ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్లాసిక్​ 650 వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 650.. క్లాసిక్ సిరీస్​లో ఫ్లాగ్​షిప్​ మోడల్​గా అవతరించింది. షాట్​గన్ ప్లాట్​ఫామ్​పై నిర్మించిన ఈ మోటార్ సైకిల్ దాని 350 సీసీ మోడల్​ డిజైన్, స్ఫూర్తికి అద్దం పడుతుంది. ఇది బ్రాండ్ అత్యధికంగా అమ్ముడైన మోడల్. అదనంగా, 650 ప్లాట్​ఫామ్​ ఐరోపా, యూకే, అమె...