Hyderabad, ఫిబ్రవరి 21 -- మానవ శరీరంలో కొన్ని భాగాలు ప్రత్యేకం. వీటిని వట్టి చేతులతో తాకడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. మీరు రెగ్యూలర్ గా ఈ తప్పులు చేస్తుంటే పద్దతి మార్చుకోవడం బెటర్. రోజువారీ జీవితంలో సెన్సిటివ్ భాగాలతో అనేక కార్యకలాపాలు చేస్తుంటాం. కానీ, అవి అవసరం మేరకే. ఆ తర్వాత వాటిని చేతులతో తాకకూడదట. దీని వల్ల సూక్ష్మజీవుల వ్యాప్తి జరిగి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిఫికల్‌గా రుజువైంది. మరి చేతులతో తాకకూడని శరీర భాగాలేంటో తెలుసుకుందామా!

మనలో చాలా మంది చెవులలో దురద పెడుతుందనో, గుబిలి ఉందనో వేళ్లను చెవులలోకి పెట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా చెవుల్లోకి వెళ్లి అక్కడి చర్మాన్ని పాడు చేస్తుంది. మీకు దురదగా లేదా ఇబ్బందికరంగా అనిపిస్తుంటే ఇయర్ స్పెషలిస్ట్ ను కలవడం ఉత్తమం.

మ...