Hyderabad, ఫిబ్రవరి 26 -- Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ అంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు కేరాఫ్. ఇప్పటికే ఎన్నో అలాంటి మూవీస్, సిరీస్ వచ్చాయి. తాజాగా ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ పేరుతో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. బుధవారం (ఫిబ్రవరి 26) ఈ సిరీస్ టైటిల్ టీజర్ ను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటికే ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు బెంగాల్ ఛాప్టర్ పేరుతో మరో సీజన్ రాబోతోంది. టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

"ఖూన్ యా కానూన్ (రక్తం లేదా చట్టం).. గెలుపు దేనిది? ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది" అనే క్యాప్షన్ తో టైటిల్ టీజర...