Hyderabad, మార్చి 27 -- Neha Kakkar: బాలీవుడ్ సింగర్ నేహా కక్కడ్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఈ మధ్య ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కాన్సర్ట్ కు మూడు గంటలు ఆలస్యం రావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఇప్పుడామె తన ఆలస్యానికి కారణమేంటో వివరించింది. నిర్వాహకులు తనను నిలువునా ముంచినట్లు ఆమె చెప్పింది.
నేహా కక్కడ్ గురువారం (మార్చి 27) తన ఇన్స్టాగ్రామ్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది. అందులో మెల్బోర్న్ కాన్సర్ట్ ఎందుకు అంత ఆలస్యమైంది? అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
"ఆమె 3 గంటలు ఆలస్యంగా వచ్చిందని వాళ్లు చెప్పారు. కానీ అసలు ఆమెకు ఏం జరిగిందో ఒక్కసారైనా అడిగారా? ఆమెకు, ఆమె బ్యాండ్ కు వాళ్లు ఏం చేశారో చెప్పారా? నేను స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మాకు ఏం జరిగిందో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.