భారతదేశం, డిసెంబర్ 9 -- Nayanthara Connect Trailer: న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ హార‌ర్ సినిమా క‌నెక్ట్ తెలుగు ట్రైల‌ర్‌ను ప్ర‌భాస్ రిలీజ్ చేశారు. గురువారం అర్థ‌రాత్రి 12న గంట‌ల‌కు ఈ ట్రైల‌ర్ రిలీజైంది. హార‌ర్ అంశాల‌తో ఆద్యంతం భ‌య‌పెడుతూ ఈ ట్రైల‌ర్ సాగింది. ఇందులో న‌య‌న‌తార‌, విన‌య్‌రాయ్ భార్యాభ‌ర్త‌లుగా క‌నిపిస్తున్నారు. న‌య‌న‌తార తండ్రిగా స‌త్య‌రాజ్ క‌నిపిస్తున్నారు. త‌మ కూతురు అమ్ముతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ ద‌య్యం ఎలాంటి క‌ల్లోలాన్ని రేపిందో ట్రైల‌ర్‌లో థ్రిల్లింగ్‌గా చూపించారు.

లాక్‌డౌన్ టైమ్‌లో సాగే క‌థ కావ‌డంతో ఫోన్ స్క్రీన్స్ ద్వారానే ఈ సినిమాలోని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన‌ట్లు చూపించారు. క‌రోనా పాజిటివ్ కార‌ణంగా ఇంట్లోనే ఉండాల్సి వ‌చ్చిన‌ట్లుగా న‌య‌న‌తార...స‌త్య‌రాజ్‌తో చెప్ప‌డం, ఆ ఇంట్లోనే ద‌య్యం ఉన...