భారతదేశం, మార్చి 7 -- Naari Movie Review: ఆమ‌ని, వికాశ్ వ‌శిష్ట‌, మౌనిక రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ నారి. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి సూర్య‌ వంటిపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అంటే?

మంత్రి భూప‌తి (నాగ మ‌హేష్‌) కొడుకుతో పాటు అత‌డి స్నేహితులు ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్ప‌డుతారు. భూప‌తికి భ‌య‌ప‌డి అత‌డికి వ్య‌తిరేకంగా కేసు వాదించ‌డానికి ఎవ‌రూ ముందుకు రారు. బాధితురాలికి లాయ‌ర్ శార‌ద (ప్ర‌గ‌తి) అండ‌గా నిలుస్తుంది. ఈ కేసును వాధించ‌డంలో భారతి(ఆమని, మౌనిక రెడ్డి) జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంది శార‌ద‌.

అస‌లు భార‌తి ఎవ‌రు? త‌న కుటుంబంలో జ‌రిగిన త‌ప్పు మ‌రెవ‌రికి జ‌ర‌గ‌కూడ‌ద‌ని భార‌తి ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ది? ప్రేమ పేరుతో భార‌తిని ...