భారతదేశం, ఏప్రిల్ 2 -- Mystery Thriller Movie త‌మిళ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ కే 13 తెలుగులోకి వ‌చ్చింది. కే 13 పేరుతోనే యూట్యూబ్‌లో రిలీజైన ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీలో అరుళ్‌నిధి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. కే 13 మూవీకి భ‌ర‌త్ నీల‌కంఠ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో గాయ‌త్రి, యోగిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్ట‌ర్ అధిక్ ర‌విచంద్ర‌న్ ఈ మూవీలో గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు. సామ్ సీఎస్ మ్యూజిక్ స‌మ‌కూర్చాడు.

2019లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ త‌మిళ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా క‌థ మొత్తం దాదాపుగా ఒకే రూమ్‌లో సాగుతుంది. కాన్సెప్ట్‌తో పాటు అరుళ్‌నిధి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా సినిమాలోని ట్విస్ట్‌ల‌ను ద‌ర్శ‌కుడు డిఫ‌రెం...