భారతదేశం, మార్చి 29 -- మయన్మార్​లో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటివరకు 694మంది మరణించారని, 1670కుపైగా మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. పొరుగున ఉన్న థాయ్​లాండ్​లోని బ్యాంకాక్​లో నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనం కుప్పకూలి ఆరుగురు మృతి చెందారు.

మయన్మార్​ భూకంపం నేపథ్యంలో సహాయక చర్యలకు అంతర్జాతీయ మద్దతును కోరానని, ఏహెచ్ఏ సెంటర్, భారత్ నుంచి మద్దతు కోసం కొన్ని ఆఫర్లను అనుమతించామని జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లయింగ్ స్టేట్ బ్రాడ్​క్యాస్టర్ ఎంఆర్టీవీలో వీడియో ప్రసంగంలో తెలిపారు.

మయన్మార్​లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 11 నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు వచ్చాయి.

మయన్మార్ యాక్టివ్​ ఎర్త్​క్వ...