భారతదేశం, ఫిబ్రవరి 17 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లు 2025లో భారీ పతనాన్ని చూస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్​ సెషన్​కి ముందు నిఫ్టీ50 ఇండెక్స్ 2 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ 7 శాతం, నిఫ్టీ స్మాల్​ క్యాప్ 250 ఇండెక్స్ 9 శాతం నష్టపోయాయి. ఇక సోమవారం కూడా నష్టాలు కొనసాగుతుండటంతో, ఈ నెంబర్​ ఇంకా పెరగొచ్చు. ఇంతటి పతనం దృష్ట్యా మిడ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​ చుట్టూ మదుపర్లలో ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఆయా ఫండ్స్​లో ఇప్పుడు సిప్​ (సిస్టెమాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​) ఆపేయాలా? లేక ఇంకా యాడ్​ చేయాలా? అని ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. దీనిపై నిపుణులు మాట ఏంటంటే..

ఈ విషయంపై నిపుణులు సునిశితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్మాల్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అస్థిరంగా ఉంటాయని వారు చెబుతున్నారు. అందువల్ల అధిక రిస్క్ తీసుకోగలిగే ఇ...