భారతదేశం, ఏప్రిల్ 13 -- ద్రవ్యోల్బణంతో పోరాడేందుకు సామాన్యుడికి ఉన్న అతిపెద్ద ఆయుధం 'ఇన్వెస్ట్​మెంట్​'. ఈ విషయం ఇటీవలి కాలంలో బాగా అర్థమవ్వడంతో చాలా మంది భవిష్యత్తు కోసం పెట్టుబడులను ప్రారంభిస్తున్నారు. వీరిలో చాలా మంది సులభతరమైన మ్యూచువల్​ ఫండ్స్​ని ఎంచుకుంటున్నారు. నెల నెల సిప్​ చేస్తూ, సంపద సృష్టికి కలలు కంటున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది తమ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించడం లేదు. తక్కువ జీతంలో డబ్బులు సరిపోవడం లేదని, మిగిలిన అర-కొరతో ఇన్వెస్ట్​మెంట్​ చేసినా ప్రయోజనం లేదని అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు! స్టాక్​ మార్కెట్​ లేదా మ్యూచువల్​ ఫండ్స్​లో ఎంత పెట్టుబడి పెడుతున్నాము అన్నది కాదు, ఎంత కాలం పెట్టుబడి పెట్టాము అన్నదే ముఖ్యం! ఈ నేపథ్యంలో, నెలకు కనీసం రూ. 1000తో సిప్​ ప్రారంభిస్తే ఏమవుతుంది? అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? అన్న వి...