భారతదేశం, ఏప్రిల్ 9 -- కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ మూవీ సెబాస్టియ‌న్ పీసీ 524 థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఆహా ఓటీటీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో కేవ‌లం తెలుగు వెర్ష‌న్‌ను మాత్ర‌మే చూడొచ్చు.

సెబాస్టియ‌న్ పీసీ 524 మూవీలో కిర‌ణ్ అబ్బ‌వ‌రానికి జోడీగా నువేక్ష హీరోయిన్‌గా న‌టించింది. కోమ‌లి ప్ర‌సాద్‌తో పాటు రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీకి బాలాజీ స‌య్య‌పురెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2022లో థియేట‌ర్ల‌లో రిలీజైన సెబాస్టియ‌న్ పీసీ 524 మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. కాన్సెప్ట్ కొత్తదే అయినా దానిని తెర‌పై ఆస‌క్తిక‌రంగా ప్ర‌జెంట్ చేయ‌డంలో ద‌ర్శ‌క...