భారతదేశం, ఏప్రిల్ 14 -- స్టాక్​ మార్కెట్​లో భారీ సంపదను సృష్టించుకోవాలంటే అది దీర్ఘకాల పెట్టుబడులతోనే సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతుంటారు. ఒక మంచి స్టాక్​ని ఎంచుకుని, చాలా కాలం పాటు దానితో జర్నీ చేస్తే మనకి అద్భుత రిటర్నులు వస్తాయి. అనేక మల్టీబ్యాగర్​ స్టాక్స్​ ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు రుజువు చేశాయి. ఈ తరహా మల్టీబ్యాగర్​ స్టాక్స్​లో ఒకటి ఆల్ఫా ట్రాన్స్​ఫార్మర్స్​! ఇదొక మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​. కేవలం 3ఏళ్లల్లోనే రూ. 1లక్ష ఇన్వెస్ట్​మెంట్​ని రూ. 10లక్షలు చేసిన స్టాక్​ ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ ఆల్ఫా ట్రాన్స్​ఫార్మర్స్​ స్టాక్ మూడేళ్ల క్రితం రూ.8.01గా ఉండేది. ఏప్రిల్​ 11తో ముగిసిన ట్రేడింగ్​ సెషన్​లో ఈ స్టాక్​ ధర రూ.81.73 వద్ద ముగిసింది.

ఆల్ఫా ట్రాన్స్​ఫార్మర్స్ ఇటీవలి దశాబ్దాల్లో భారత స్టాక్ మార్కెట్ అందించిన వెల్త్...