భారతదేశం, ఏప్రిల్ 17 -- Multi Genre OTT: తెలుగు మ‌ల్టీజాన‌ర్ మూవీ నేను కీర్త‌న ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. చిమ‌ట రమేష్ బాబు హీరోగా న‌టిస్తూ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రిషిత‌, మేఘ‌న హీరోయిన్లుగా న‌టించారు.

గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో నేను కీర్త‌న మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు ఏడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట్‌తో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో జీవా, విజ‌య్ రంగ‌రాజుతో పాటు జ‌బ‌ర్ధ‌స్థ్ అప్పారావు, స‌న్నీ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎంఎల్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు.

ల‌వ్, సెంటిమెంట్‌, యాక్ష‌న్‌, రొమాన్స్...అన్ని అంశాల‌తో మ‌ల్టీజాన‌ర్ మూవీగా ద‌ర్శ‌కుడు ర‌మేష్‌బాబు ఈ సినిమాను రూపొందించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.9 రేటింగ్‌ను సొం...