భారతదేశం, ఏప్రిల్ 15 -- మోటోరోలా తన కొత్త స్మార్ట్​ఫోన్​ని ఇండియాలో లాంచ్​ చేసింది. దీని పేరు మోటోరోలా ఎడ్జ్​ 60 స్టైలస్​. ఇదొక మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్​. మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ సర్టిఫికేషన్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్, క్వాడ్ కర్వ్​డ్​ ఓఎల్ఈడీ డిస్​ప్లే వంటి స్పెసిఫికేషన్స్​తో వస్తున్న ఈ స్మార్ట్​ఫోన్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ సింగిల్ 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్​లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.22,999. ఫ్లిప్​కార్ట్, మోటోరోలా సొంత వెబ్​సైట్, ఆఫ్​లైన్ స్టోర్లలో ఈ ఏప్రిల్ 23 నుంచి ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్ అందుబాటులో ఉండనుంది.

పాంటోన్ సర్ఫ్ ది వెబ్, పాంటోన్ జిబ్రాల్టర్ సీ అనే రెండు కలర్ వేరియంట్లలో ఈ స్మార్ట్​ఫోన్ లభించనుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్...